కట్టమూరు పుంతలోని క్లాప్స్ ఫెలోషిప్ అధ్యకక్షులు రెవ. లంక పురుషోత్తం దాసుగారి కల్వరి మిరాకల్ చర్చినందు ఉపాధ్యకక్షులు రెవ.ఎన్. భాస్కరరావు గారి అధ్యక్షతన జరిగియున్నది. పెద్దాపురం, పెద్దాపురం రూరల్ గ్రామాల నుండి దైవజనులు, దైవజనురాండ్రు అనేకులు ఉత్సాహంగా పాల్గొని యున్నారు. ఈ కూడికలో రెవ.వి.ప్రసాద్‌పాల్, కాకినాడ సిీ సబ్ అర్బన్ అధ్యకక్షులు దైవసందేశాన్ని అందించి యున్నారు. అనంతరం వచ్చిన దైవ సేవకులకు బహుమతులు అందించియున్నారు. అనంతరం తూ.గో.జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ వారు ఏర్పాటు చేసిన పాస్టర్స్ సంక్షేమ పథకం క్రింద లక్ష రూపాయల ఇన్సూరెన్స్ బాండ్లు జాయిన్ అయిన వార్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవ. బిషప్ సి.బి. సుకుమార్, రెవ.వై.ఆర్. మన్నా గారు, రెవ.డి.పి. డి.కె. జార్జిమేషన్, రెవ.ి.జి. గ్రేస్‌పాల్, పాస్టర్ త్రినాథ్ పాల్ (కాకినాడ), రెవ.ఆర్. నెహెమ్యా, వంశీపాల్ చందుస్టీఫెన్, బ్ర.సంజీవరావు, జె.సుధాకర్,రెవ.ప్రసాద్‌రావు, సి.బి.బోస్, ఎస్.బి. లంక రాజకుమారి, యు. విజయలక్ష్మి తదితరులు పాల్గొని సభను విజయవంతం చేసారు.
ఘనంగా జరిగిన క్లాప్స్ ఫెలోషిప్ కూడిక