ఎమ్మెల్సీ: క్రిస్టియన్లకు కేసీఆర్ హామీ, టీని చూసి దేశం..

క్రిస్టియన్ మతపెద్దలు సూచించిన వారికే ఎమ్మెల్సీ సీటును ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం అన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా క్రిస్టియన్లకు ఎమ్మెల్సీ సీటును కేటాయిస్తామని చెప్పారు. తెలంగాణలో లౌకిక స్ఫూర్తిని నెలకొల్పుతామని, ఇతర రాష్ట్రాలు తెలంగాణను చూసి ఆదర్శంగా నిలిచేలా చేస్తామన్నారు.


రంజాన్ మాసం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చినట్లే, క్రిస్టియన్లకు క్రిస్మస్ సమయంలో ప్రత్యేక కార్యక్రమం ఉంటుందన్నారు. క్రిస్టియన్లకు రిజర్వేషన్ల శాతం పెంచే ప్రయత్నాలు చేస్తామన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మత సామరస్యానికి విఘాతం కలిగిందని, ఇప్పుడు ఆలాంటివి ఉండవన్నారు.