ఫిక్స్‌డ్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించింది. కొత్త రేట్లు ఇవాళ్టి నుంచి అమలులోకి వస్తాయి. ఈనెలలోనే వడ్డీ రేట్లను తగ్గించడం ఇది రెండవసారి. మార్చి 10వ తేదీనే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. 75 బేసిస్ పాయింట్లతో రెపో రేటును ఆర్బీఐ తగ్గించడంతో.. ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్‌బీఐ ఎఫ్‌డీలను 7 రోజుల నుంచి 45 రోజుల వరకు పిక్స్ చేస్తే దానిపై 3.5 శాతం మాత్రమే వడ్డీ ఇవ్వనున్నారు. 46 రోజుల నుంచి 179 రోజుల వరకు ఫిక్స్ చేసే టర్మ్ డిపాజిట్లపై 4.5 శాతం ఇవ్వనున్నారు. 180 రోజుల నుంచి ఏడాది వరకు ఫిక్స్ చేసే వాటిపై 5 శాతం ఇస్తారు. ఏడాది నుంచి10 ఏళ్ల వరకు చేసిన ఎఫ్‌డీలపై 5.7 శాతం వడ్డీ ఇవ్వనున్నారు. అయితే సీనియర్ సిటిజన్లకు మాత్రం ఎఫ్‌డీ వడ్డీ రేటును 4 నుంచి 6 శాతం వరకు ఫిక్స్ చేశారు.
ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ